CASH LESS HEALTH SCHEME
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు JAC-AP మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందం లో భాగంగా 23 జనవరి 2011 ప్రస్తుత మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ స్థానం లో "కాష్ లెస్ హెల్త్ స్కీం" ను ప్రారంబించుటకు ప్రభుత్వం అంగీకరించింది
ఈ స్కీం లో ముఖ్య అంశాలు:
1. ముఖ్య మంత్రి అధ్యక్షులుగా " ఆంద్ర ప్రదేశ్ ఎంప్లయీస్ అండ్ పెన్షనర్స్ హెల్త్ కేర్ ఫండ్ " పేరుతో ప్రభుత్వం ఈ పధకం ను నిర్వహిస్తుంది
2. ఈ పధకం ద్వారా 13.78 లక్షల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్స్ లబ్ది పొందుతారు
3. ఈ పధకం లో చెరుట కొరకు గెజిటెడ్ ఉద్యోగులు నెలకు 120 మరియు నాన్ -గెజిటెడ్ ఉద్యోగులు నెలకు 90 రూపాయలు తమ కంట్రీబ్యుషన్ గా తమ జీతముల నుండి ప్రతి నెల చెల్లించాలి.
4. కుటుంబంనకు గరిష్టం గా సంవత్సరానికి 3 లక్షలు మరియు వ్యక్తికి 2 లక్షలు గరిష్ట పరిమితి విధించ బడినది
5. ఈ పధకానికి అయ్యే ఖర్చు ఏడాదికి రూ.350 కోట్లు. దీనిలో 140 కోట్లు ఉద్యోగులనుండి కంట్రీబ్యుషన్ గా మరియు ప్రభుత్వం 250 కోట్లు సమకూర్చుతుంది.
6. "ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ " లోని దాదాపు 350 ఆసుపత్రులలో 942 రకాల వ్యాధులకు "ఔట్ పేషెంట్ లేదా ఇన్ పేషెంట్ " గా చికిత్స అందించ బడును. ఈ జాబితాలో లేని వ్యాధులకు కూడా ప్రత్యెక అనుమతి తో చికిత్స అందించబడును.
7. అర్హులైన కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన "హెల్త్ కార్డు" లను ఖజానా శాఖ ఉద్యోగుల వివరాలను సేకరించి అందిస్తుంది.దీని కొరకు ఉద్యోగులు తమ వివరాలను అన్ లైన్ లో నింపవలసి ఉంటుంది
8. భార్య, భర్త ఇద్దరు ఉద్యోగులు ఐతే ఒక్కరైన కంట్రీబ్యుషన్ చెల్లిస్తే చాలు కానీ భార్య కూడా కంట్రీబ్యుషన్ చెల్లిస్తే ఆమె పై ఆధార పడిన తల్లి తండ్రులకు కూడా ఈ స్కీం వర్తిస్తుంది.
9. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ తో పాటు వారి పై ఆధార పడిన వారి తల్లి తండ్రులు, భార్య లేదా భర్త , ఆధారపడిన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది.
10. ఎంప్లయీస్ హెల్త్ కేర్ ఫండ్ డ్రాఫ్ట్ యొక్క Term -2 నందు ఇవ్వబడిన కుటుంబ విర్వచనం క్రింద ఇవ్వబడినది
ఫ్యామిలీ - Dependents--
(a) In case of male Government Servant, family means his parents, wife, legitimate children including an adopted son and step children residing with and wholly dependent on him;
i) The word “wife” includes more than one wife.
ii) A married daughter who is under the protection of her husband does not come within the definition of “family “for the purpose of the scheme.
iii) The deserted, divorced or widowed daughters who are residing with entirely dependent on the Government Servant.
iv) Family includes adoptive parents who are wholly dependent on the Government Servant but does not include the real parents, though they are wholly dependent on the Government Servant once the adoption is affected.
(b) In case of female Government Servant it means her parents, husband and children residing with and holly dependent on her.
దీని యొక్క పూర్తి ప్రతిని www.apteachers.in నందు చూడగలరు -CLICK
11. కనీసం 50 పడకలు కలిగి స్త్రీ, పురుషులకు ప్రత్యెక వార్డులు, అంబులన్సు, అన్ని సౌకర్యాలు కలిగిన ల్యాబ్ ఉన్న ఆసుపత్రులకు మాత్రమె ఈ పధకం నందు అనుమతి లబించును
12.ఈ ఆసుపత్రులు ప్రతి 2 సంవత్సరాలకు ఒక సారి ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు కుటుంబ సభ్యులకు ఒక సారి ఉచితముగా హెల్త్ చెక్ అప్ చేయాలి
13. చికిత్సకు ముందే వ్యాధి, వైద్యం, ఖర్చు మొత్తం వివరాలు ట్రస్ట్ కు తెలియ చేస్తే 24 గంటలలో అనుమతి లబిస్తుంది
హెల్త్ కార్డు లు వివరాలు నింపుటకు సూచనలు
మీ వివరాలు నింపుటకు లాగిన్ అవ్వుట
- *మొదట గా హెల్త్ కార్డు లు నింపుటకు వెబ్ సైట్ ను తెరిచి అందులో మీ ట్రెజరీ ID నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి
- వెంటనే మీ పేరు వస్తుంది
- ఆ తరువాత మీకు ఇష్టం వచ్చిన పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యాలి
- తిరిగి మళ్లి ఇంకొక సారి ఎంటర్ చెయ్యాలి
- మీ DDO యొక్క కోడ్ ను ఎంటర్ చెయ్యాలి. ఆ తరువాత LOGIN అవ్వాలి
- *ఇది వరకే ఎప్పుడైనా మీరు లాగిన్ అయ్యి వుంటే మీ ట్రెజరీ ID నెంబర్ ను ఎంటర్ చేసిన తరువాత మీరు ఇంతకూ ముందు పెట్టుకున్న పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యాలి
- *మీ పాస్ వర్డ్ మర్చి పొతే మీ STO ను కాంటాక్ట్ చెయ్యండి
- *పాస్ వర్డ్ గా మీ కుటుంబ సభ్యుల పేర్లు గాని, మీ సెల్ నెంబర్ లు గాని పెట్టుకుంటే మీరు మరిచి పోవడం తక్కువ! .
ఫారం - 1 నింపుట
మీరు లాగిన్ తరువాత మొదటగా ఫారం - 1 లో మీ వివరాలు నింపవలసి ఉంటుంది
- ఫారం - 1 నాలుగు భాగాలుగా ఉంటుంది. 1 వ భాగం లో ఉద్యోగి వివరాలు, 2 వ భాగం లో కార్యాలయ వివరాలు, 3 వ భాగం లో నివాస వివరాలు, 4 వ భాగం లో అదనపు వివరాలు పొందపోరచవలసి ఉంటుంది
- *గుర్తు కలిగిన వివరాలు తప్పని సరిగా నింపాలి
- సీరియల్ నెంబర్ 2. Sector Type లో State Govt/ Zilla Parishad/ Aided Edn Instutns/ Zilla Praja Parishad/ Mandal Praja Parishad/ Gram Panchayat/ Municipal Corporation/ Municipalities,..etc నుండి ఒకదానిని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది
- సీరియల్ నెంబర్ 3 లో Department Code గా టీచర్లు అందరు SCHOOL EDUCATION ను సెలెక్ట్ చెయ్యాలి
- సీరియల్ నెంబర్ 4 లో Employee Designation దగ్గర మన Designation అనగా Secondary Grade Teacher, PET, SA (Maths)....ను సెలెక్ట్ చెయ్యాలి
- సీరియల్ నెంబర్ 10 లో Designation Status లో Gazetted లేదా Non Gazetted సెలెక్ట్ చెయ్యాలి
- సీరియల్ నెంబర్ 11 లో PRC 2010 ను సెలెక్ట్ చెయ్యాలి.
- మిగిలిన వివరాలు 2,3,4 భాగాలలో నింపాలి. 4 వ భాగం లో PF, PRAN, APGLI, AADHAR, RATION CARD...లలో మనకు లేని వివరాలు నింప వలసిన అవరసరం లేదు. వాటిని ఖాళీగానే ఉంచవలెను
- అన్ని వివరాలు సరిచుసుకున్న తరువాత కిందన ఉన్న Update to Continue పై క్లిక్ చేసి ఫారం - 2 కు వెళ్ళవలెను
ఫారం - 2 నింపుట
- ఫారం - 2 లో మొదటగా మన వివరాలు సరిచూసుకుని కుడి పక్క చివరన గల BROWSE పై క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ను అప్ లోడ్ చెయ్యాలి. వెంటనే మీ ఫోటో అక్కడ కనిపిస్తుంది
- (IMP: ఫోటో యొక్క సైజు ను 100kb కు మించ కూడదు. jpg, jpeg, png ఫార్మాట్ లలో మాత్రమే ఉండాలి
- పాస్ పోర్ట్ సైజు ఫోటో మాత్రమే అప్ లోడ్ చెయ్యాలి.)
- తరువాత మీ Dependents Details ను ఎంటర్ చెయ్యాలి.
- అందులో Dependent Emp Code దగ్గర మీ Dependent కనుక employee ఐతే వారి కోడ్ ను ఎంటర్ చెయ్యాలి లేనిచో ఖాలిగా ఉంచాలి
- చివరగా వారి ఫోటో ను కుడా అప్ లోడ్ చెయ్యాలి
- తరువాత Add Details పై క్లిక్ చేసి ఇతర కుటుంబ సభ్యుల వివరాలు కుడా నింపాలి.
- మీరు ఎంటర్ చేసిన కుటుంబ సభ్యుల వివరాలు పైన అడ్డు వరసలలో వచ్చి చేరుతాయి.
- అన్ని వివరాలు సరిచుసుకున్న తరువాత Submit to DDO & Print Form పై క్లిక్ చేసి మీ వివరాలు ప్రింట్ తీసి మీ DDO కు అందచేయ్యాలి. ఒక కాపీ మీ వద్ద కూడా ఉంచుకోవాలి .
- మీకు ఏమైనా సం దేహాలు ఉంటె మీ DDO ను సంప్రదించండి. ఆ తరువాత మాత్రమె నింపండి.
Make a Free Website with Yola.